శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం

దేవాదాయ - ధర్మాదాయ శాఖ

గొల్లలమామిడాడ-533344, పెదపూడి మండలం,

తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

భక్తులకు విజ్ఞప్తి

భక్తులకు దర్శనములను నియమ నిబంధనలకు లోబడి అనుమతించబడునని తెలియచేయడమైనది. కరోనా నివారణ భాగం గా ఆలయం నందు భక్తులకు సూచనలు.
 founder png

ఆలయ స్థాపకుడు గురించి

శ్రీ కొవ్వూరి బసివిరెడ్డిగారు, గోదావరి జిల్లాలో మామిడాడ గ్రామము న 1852 వ సంవత్సరమున జన్మించెను. శ్రీ కొవ్వూరి బసివిరెడ్డిగారు రైతుగా జీవితం మొదలుపెట్టి, తమ తెలివితేటలతో మరియు దైవానుగ్రహం తో వ్యవసాయ వాణిజ్యములందు ఆరితేరినవారై అనేకమైన భూములు, సంపదలు సంపాదించుటయేగాక వాటిని వితరణ చేసిన దానశీలురు, గృహదానము, వస్త్రదానము, అన్నదానము, బావులు త్రవ్వించుట, వనములు పెంచుట, దేవాలయ నిర్మాణము, అగ్రహారముల నిర్మాణము, అపత్యప్రార్తి, నిధినిక్షేపముల ఏర్పాటు, సంత్కృతిన పొందుట మొదలైన సప్తసంతినముల బడసిన మహనీయులు శ్రీ బసివిరెడ్డి గారు.

Read more →
gopura png

ఆలయం గురించి

స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశీ బుధవారము అనగా ది . 18 - 06 - 1902 నాడు శ్రీయుతులు కొవ్వూరి బసివిరెడ్డి గారిచే శ్రీపాంచరాత్రాగము | ప్రావీణ్యులైన శ్రీమాన్ రేజేటి రంగాచార్యులు స్వామి వారి ఆధ్వర్యమున శ్రీ సూర్యనారాయణ స్వామివారిని , శ్రీలక్ష్మీనారాయణ , శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివార్ల ఉపాలయములుగా శ్రీ విష్వక్సేన , గరుడాళ్వార్ మొదలుగాగల పరివార దేవతలుగను ధ్వజస్థంబ సహితముగా ఆలయము ప్రతిష్టాకార్యక్రమము జరుపబడింది .

Read more →

ఆలయ సమయాలు

ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు

సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు

ఆడియో వినండి :

మమ్మల్ని అనుసరించండి: