శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం

దేవాదాయ - ధర్మాదాయ శాఖ

గొల్లలమామిడాడ-533344, పెదపూడి మండలం,

తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.


దేవాలయ ఆవిర్భావము :

founder image

స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశీ బుధవారము అనగా ది . 18 - 06 - 1902 నాడు శ్రీయుతులు కొవ్వూరి బసివిరెడ్డి గారిచే శ్రీపాంచరాత్రాగము | ప్రావీణ్యులైన శ్రీమాన్ రేజేటి రంగాచార్యులు స్వామి వారి ఆధ్వర్యమున శ్రీ సూర్యనారాయణ స్వామివారిని, శ్రీలక్ష్మీనారాయణ, శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివార్ల ఉపాలయములుగా శ్రీ విష్వక్సేన,గరుడాళ్వార్ మొదలుగాగల పరివార దేవతలుగను ధ్వజస్థంబ సహితముగా ఆలయము ప్రతిష్టాకార్యక్రమము జరుపబడింది.

నేటికిని శ్రీవారి వార్షిక కళ్యాణ మహోత్సవమును ప్రతి సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి రోజున శ్రీ వారికి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవోపేతముగా శ్రీమాన్ కొవ్వూరి బసివిరెడ్డిగారి వంశస్థులు నిర్వహించుచున్నారు. శ్రీమాన్ కొవ్వూరి బసివిరెడ్డిగారి వంశస్థులు ఆధ్వర్యమున దేవాలయమునకు అనేక అభివృద్ధి కార్యక్రమములు గ్రామాభివృద్ధి కార్యక్రమములు అభివృద్ధి పరచబడి వాటికి, నేటికి, సాటిలేని మేటి దైవంగా సూర్యదేవాలయం అభివృద్ధి చెందుచూ శ్రీమాన్ రేజేటి రంగాచార్యులు స్వామి వారి వంశపరంపర అర్చకుల ద్వారా నాటినుండి నేటివరకూ తరతరాలుగా అర్చనలు నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ మహోత్సవములను శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి నిత్య వేదపారాయణలతో అందుకుంటూ విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. నేటికి ఈ ఆలయం నిర్మాణం జరిగి నూట పద్దెనిమిది సంవత్సరములు పూర్తి అయి ఉన్నది. ఈ దేవాలయమునకు ప్రాకారము చతుర్దిక్కుల యందు చతుర్వార గోపురములు కలిగి ఉండుట విశేషం. కాకినాడ, సామర్లకోట మీదుగా బస్సులద్వారా చేరుటకు కూడా 20 కిలోమీటర్ల దూరములోనే కలదు .

ఆలయ చరిత్ర :

ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారాయణస్వామి వారి ఆలయం తూర్పు గోదావరి జిల్లా, గొల్లల మామిడాడలో శ్రీ కొప్వూరి బసివిరెడ్డిగారు, వారి సోదరులు చిన్నయ్యగారు, గ్రామ పెద్దల సమక్షంలో 1902 జూన్ మాసంలో ( జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ప్రతిష్టితమైనది. శ్రీ స్వామివారి ఆలయంలో పాంచారాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆరాధన జరపబడుతున్నది. జూన్ మాసంలో వార్షిక కల్యాణ మహోత్సవం, తొలి ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, విజయదశమి. శమీపూజ, కార్తీక మాసమున క్షీరాబ్ది ద్వాదశి, తెప్పోత్సవం, కృతికా దీపోత్సవం, మార్గశిరమున ధనుర్మాస మహోత్సవము, మకర సంక్రమణము. మాఘమాసంలో రధసప్తమి, రథోత్సవం, భీష్మ ఏకాదశి, బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించబడుచున్నవి. ఈ ఆలయమునందు ఉ పాలయములుగా ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, సత్యనారాయణ స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు, వైశాఖ శుద్ధ ఏకాదశి, జ్యేష్టశుద్ధ ఏకాదశిలలో కల్యాణ మహోత్సవాలు, శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రతములు, శ్రావణ శుక్రవార పూజలు, ప్రతి ఆదివారం భక్తులచే శ్రీ స్వామి వారికి పాలాభిషేకములు జరుపబడుతున్నది. శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయం కొవ్వూరి బసివిరెడ్డి గారి వంశస్థులు, గ్రామస్తులతో ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నవి.

ఆలయ సమయాలు

ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు

సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు

ఆడియో వినండి :

మమ్మల్ని అనుసరించండి: