శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం

దేవాదాయ - ధర్మాదాయ శాఖ

గొల్లలమామిడాడ-533344, పెదపూడి మండలం,

తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.


“అన్నదాత" కొవ్వూరి బసివిరెడ్డిగారి “ జీవిత సంగ్రహము"

founder image

శ్రీ కొవ్వూరి బసివిరెడ్డిగారు, గోదావరి జిల్లాలో మామిడాడ గ్రామము న 1852 వ సంవత్సరమున జన్మించెను. శ్రీ కొవ్వూరి బసివిరెడ్డిగారు రైతుగా జీవితం మొదలుపెట్టి,తమ తెలివితేటలతో మరియు దైవానుగ్రహం తో వ్యవసాయ వాణిజ్యములందు ఆరితేరినవారై అనేకమైన భూములు, సంపదలు సంపాదించుటయేగాక వాటిని వితరణ చేసిన దానశీలురు, గృహదానము, వస్త్రదానము, అన్నదానము, బావులు త్రవ్వించుట, వనములు పెంచుట, దేవాలయ నిర్మాణము, అగ్రహారముల నిర్మాణము, అపత్యప్రార్తి, నిధినిక్షేపముల ఏర్పాటు, సంత్కృతిన పొందుట మొదలైన సప్తసంతినముల బడసిన మహనీయులు శ్రీ బసివిరెడ్డి గారు.

కుతుకులూరు, కాకినాడ, గొల్లలమామిడాడ, గండ్రేడు, నిడదవోలు బసివిరెడ్డి పేటలే ఆయన కీర్తికి దర్పణములు. శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్టణము, ఉభయగోదావరి జిల్లాలలో అనేకమున బావులు త్రవ్వించుట, సత్రములు కట్టించుట జరిగినది. శ్రీ కొవ్వూరి బసివిరెడ్డి గారు గొల్లలమామిడాడలో 1902 జూన్ మాసంలో నిర్మించిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయము, ఆంధ్రదేశములోనే వన్నెకెక్కినది .

శ్రీమాన్ కొవ్వూరి బసివిరెడ్డిగారు తన జీవితకాలంలో సామర్లకోటలో పెద్ద సత్రము నిర్మించి విశేష అన్నదానము చేసినారు.నిత్యాన్నదానము కొనసాగింపబడుతున్న సామర్లకోటలోని శ్రీ బసివిరెడ్డిగారి సత్రము ఆయన దాతృత్వమునకు నిదర్శనము. కాకినాడలో ఉన్న కుళాయి చెరువుకు రూ. 10 వేలు విరాళంగా ఇచ్చి జలదాతగా అనేకమైన నూతులు తవ్వించినారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక గ్రామాల్లో గృహనిర్మాణం కొరకు ఇళ్ళస్థలాలు (బసివిరెడ్డి పేటలు కలవు) ఇచ్చినారు. వీరి దాతృత్వమునకు | విక్టోరియా మహారాణిచే 18వ శతాబ్దమునే అన్నదాత అను బిరుదు పొందినారు. వీరికి ఎంఎస్ఎస్ ఛార్టీస్ వారు జీవితకాల సభ్యత్వము అందజేసినారు. నేటికిని వారు చేసిన సేవా కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా ఆహారం, నీరు, వస్త్రాలు అందజేసినారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న వీరి కులస్తులు భూమంచి రెడ్డిలు, ఉన్నత స్థితికి పాటుపడినారు.శ్రీ కొవ్వూరి బసివిరెడ్డిగారు 1915 వ సంవత్సరమున స్వర్గస్తులయ్యారు. వీరి చరిత్రను ఓలేటి పార్వతీశం కవులు పద్యరూపంగా అందించగా దానిని శ్రీ ఓలేటి శ్రీరామచంద్రమూర్తిగారు వచనరూపంలోకి తెచ్చినారు. నేటికిని బసివిరెడ్డిగారి జీవితచరిత్రలో విక్టోరియా | మహారాణి అందజేసిన అన్నదాత ప్రశంసాపత్రాన్ని ముద్రణ రూపంలో చూడవచ్చు.

ఆలయ సమయాలు

ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు

సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు

ఆడియో వినండి :

మమ్మల్ని అనుసరించండి: