శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం

దేవాదాయ - ధర్మాదాయ శాఖ

గొల్లలమామిడాడ-533344, పెదపూడి మండలం,

తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.


స్థల పురాణము - అర్చనలు - ఉత్సవ విశేషములు :

ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని కేవలం నవ గ్రహములకు నాయకుడైన సూర్యునిగా గాక - వేద ఇతిహాస ప్రమాణములను బట్టి స్వయం నారాయణునిగా పాంచరాత్రాగమ సాంప్రదాయముగా అర్చించుట ప్రసిద్ధి . మరియు భారతదేశంలోనే వైష్ణవ సాంప్రదాయంలో నున్న ఏకైక సౌరక్షత్రం గొల్లలమామిడాడలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం . ఇక్కడ స్వామి ఉషాపద్మినీ ఛాయాసౌజా దేవేరులతో వేంచేసి ఉండడం విశేషం . వైష్ణవ సాంప్రదాయంలో జరిగే అన్ని ఉత్సవాలు ఇక్కడ ఆగమ సాంప్రదాయంగానే జరుగుతాయి . స్వామి వారికి చైత్రభానునికి ఉగాది ఉత్సవంలో ప్రతీ సంవత్సరం ఉత్సవాలు ప్రారంభం అవుతాయి . రాష్ట్రతం దేశవిదేశాల నుండి భక్తులు ఇక్కడ స్వామి వారిని దర్శించుకొని ఇష్టకామ్యములను విన్నవించుకొని వెళ్ళి ఇష్టార్ధములు సిద్ధించిన పిదప పున : స్వామిని దర్శించుకొంటారు . ప్రభువులు ప్రభుత్వ స్థిరత్వమునకు , ప్రజాప్రీతికి , ప్రజారంజక పరిపాలన కొరకు ప్రభుత్వోద్యోగుల పదవీ ఔనత్వమునకు ప్రభుప్రతికి , రోగులు రోగ నివృత్తి కొరకు , విదేశగమనము చేసేవారు అక్కడ స్థిరపడుటకు ఈ స్వామిని దర్శించుకొని అర్చించి అనుగ్రహము పొందుటకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ అరుణ సౌర పారాయణ పూర్వకముగా చేసెడి సూర్యనమస్కార తీర్థమును తీసుకుని భాస్కరానుగ్రహము పొందుతుంటారు . మరియు ప్రతీ ఆదివారం స్వామివారిని స్నానాసనము ( స్నపనవేదిక ) పై ఉంచి పాలతో అభిషేకించి భక్తులు పేరిట విశేషపూజలు జరుగుతూంటాయి . గ్రహనాంతరం స్వామి ( మూలవిరాట్ ) లకు విశేష అభిషేకములు పూజలు జరుపుతారు . నిత్యంలో భక్తుల సౌలభ్యం కొరకు స్వామివారికి సహస్రనామ తులసికుంకుమార్చనలు జరుగుతాయి .
పూజలు మరియు పండుగల జాబితా
  1. ఆషాఢమాసం :
    • శుద్ధ ఏకాదశి
    • శుద్ధ ఏకాదశి ( తొలి ఏకాదశి , శయన ఏకాదశి , ఛాతుర్మాస్య వ్రతారంభం ) రోజున స్వామి వారికి అభిషేకాదులు జరిపించి తదనంతరం అలంకరణ విశేష అర్చనలు జరుగుతాయి

  2. శ్రావణమాసం :
    1. ప్రతీ శుక్ర , మంగళ వారములలో పూర్ణిమ పర్వదినమున సామూహిక సువాసినీ కుంకుమార్చనలు జరుగుతాయి .
    2. శ్రీ కృష్ణాష్టమి:
    3. కృష్ణాష్టమి రోజున ఉట్ల సంబరం , కృష్ణ జన్మోత్సవం , కాయము ( కాయపు ముద్ద ) పంచుట జరుగును .

  3. ఆశ్వీయజము :
    1. శుద్ధదశమి:
    2. శుద్ధదశమికి శమీ వృక్ష ఆరాధన ( జమ్మి చెట్టు ) అర్చన . అపరాధిత పూజలు దేవాలయము వద్దనున్న శమీ వృక్ష మూలమున జరుగును .

    3. ఆకాశదీపం :
    4. వైష్ణవ ఆగమ ప్రకారం కృత్తికా దీప ప్రారంభం ఆశ్వీయుజ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు నెలరోజులు ఆకాశదీపం పెట్టుట ఇక్కడ దేవాలయంలో సనాతన ఆచార విశేషం .

  4. కార్తీకమాసం :
  5. నెలరోజులూ స్వామిని సేవించుకొనుటకు వచ్చే భక్తులు , దీక్షాస్వాములతో దేవాలయం రద్దీగా ఉంటుంది .

    • కార్తీక శుద్ధ ద్వాదశీ :
    • కార్తీక శుద్ధ ద్వాదశీ అనగా క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీ స్వామి వారికి విశేష అర్చనలు మరియు స్వామి వారిని శేషవాహనంపై గ్రామోత్సవం జరిపించి రాత్రికి పవిత్ర తుల్యానదీలో శ్రీ వారికి తెప్పోత్సవం ( తెప్పతిరునాళ్ళు ) అత్యంత వైభవంగా నిర్వహించబడును . శ్రీవారి ఆలయ ప్రాంగణం దీపములతో అలంకరించెదరు .

  6. మార్గశిర మాసం :
    1. ధనుస్సంక్రమణం,
    2. ధనుర్మానోత్సవం:
    3. ధనుర్మానోత్సవం ( నెలగంట ) ప్రారంభం నుండి భోగి వరకు ముప్పదిరోజులు ప్రాతఃకాలమున పవిత్ర తుల్యానది నుండి తీర్థపుబిందెతో తీర్థమును తెచ్చి స్వామిని అర్చించి పాశుర విన్నపములు ద్రవిడవేద పారాయణలు ప్రబంధ పఠనములు తీర్థగోష్ఠి ప్రసాద వినియోగములు జరుగును . ప్రతి నిత్యం స్వామివారిని పల్లకీ సేవ గ్రామంలో నిర్వహించెదరు .

    4. మకర సంక్రాంతి :
    5. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన మకర సంక్రాంతి రోజున స్వామి వారికి విశేష అర్చనలు జరుగును . ఈ సంక్రాంతి పర్వదినమున ఉత్తరాయన పుణ్యకాలములో స్వామి వారికి విశేష అలంకరణలు చేసి విశేష అర్చనలు జరుగును . శాస్త్ర విధిగా ఆ సంవత్సరం పంచాంగం ప్రకారం మకర సంక్రాంతి పుణ్యకాల సమయమున స్వామికి భక్తులు సమర్పించ వలసిన దానాదులు సమర్పించబడును .

    6. వైకుంఠ ఏకాదశీ ( ముక్కోటి ఏకాదశీ ) :
    7. రోజున శ్రీవారి ఉత్తరద్వార దర్శనము తెల్లవారుఝామునుండి ఉదయం 6 - 00గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం జరుగును . అనంతరం స్వామివారిని గరుబవాహనం పై గరుడోత్సవం గ్రామపుర వీధులలో జరుగును . రాత్రికి ఆలయ ప్రాంగణం దీపాలతో అలంకరించెదరు .

  7. మాఘ మాసం :
  8. సూర్యనారాయణ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమగుటచే ప్రతీ ఆదివారములలో విశేష అర్చనలు ప్రతి నిత్యము మాఘపూజలు జరుగును .

    1. రథ సప్తమీ ( మాఘ శుద్ధ సప్తమీ ):
    2. సూర్య జయంతి రోజున శ్రీవారికి సప్తదశకలశస్నపనాధులచే అభిషేకములు విశేష అలంకరణ అమృత కలశ వితరణ జరుగును

      అమృత కలశతీర్థము : . ఈ అమృత కలశతీర్థము పాలతో ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాదులచే తయారుచేసి భక్తులకు ప్రసాదములుగా అందించెదరు . రోగులు , సంతానములేని విశేషముగా ఈ తీర్థమును తీసుకున్న రోగులకు రోగనివృత్తియు , వంధ్యలకు సత్సంతాన ప్రాప్తియు కలుగును .

      ఈ రధసప్తమి రోజున స్వామివారికి రథోత్సవం జరుగును . రాత్రికి ఆలయ ప్రాంగణం అంతా దీపములచే విశేషంగా అలంకరించెదరు .

    3. మాఘ శుద్ధ ఏకాదశీ ( భీష్మ ఏకాదశీ ) :
    4. భీష్మ ఏకాదశీ పర్వదినమున శ్రీ స్వామివారికి రాత్రికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును .

      పగలు శ్రీ స్వామి వారికి రథోత్సవం వివిధ వేషధారుల మధ్య , వివిధ వాయిద్యాల మధ్య భక్తుల వివిధ జయజయ ద్వానాల మధ్య ఊరేగింపు ఉత్సవం జరుగును. రాత్రికి శ్రీ వారి కళ్యాణ మహాత్సవానంతరం శ్రీ స్వామివారిని అమ్మవార్లతో కల్సి గరుడవాహనంపై వేంచేయింపచేసి శ్రీవారికి జరిపించెడి ఉత్సవంలో ఎక్కువ బాణాసంచా పోటీల ధ్వని కాంతులతో , నృత్యగీతాది మంగళవాయిద్యముల మధ్యన శ్రీ స్వామివారిని దర్శించుటలో భక్తులకు భువియే ఒక వైకుంఠముగా భావించెదరు .

    5. మాఘశుద్ధ త్రయోదశి :
    6. త్రయోదశి శ్రీవారికి సదశ్యమహోత్సవం సతుర్థశి రోజున శ్రీవారి గరుడోత్సవం మాఘశుద్ధపూర్ణిమ రోజున శ్రీవారి వసంతోత్సవ కంకనవిసర్జనము శ్రీవారి చక్రతీర్థ స్నానమహోత్సవ పవిత్రతుల్యానదీ తీరమున జరుగును . అనంతరం పూర్ణాహుతి మహోత్సవం జరిపించెదరు .

    7. మాఘశుద్ధ చతుర్దశి జరుగును .
    8. చతుర్దశి రోజున శ్రీవారి గరుడోత్సవం

    9. మాఘశుద్ధ పూర్ణిమ
    10. పూర్ణిమ రోజున శ్రీవారి వసంతోత్సవ కంకనవిసర్జనము శ్రీవారి చక్రతీర్థ స్నానమహోత్సవ పవిత్రతుల్యానదీ తీరమున జరుగును . అనంతరం పూర్ణాహుతి మహోత్సవం జరిపించెదరు .

    11. మాఘబహుళ పాడ్యమి
    12. పాడ్యమి రోజు రాత్రికి శ్రీ స్వామివారికి శ్రీ పుష్పయాగ మహోత్సవం కడు రమ్యముగా అద్దాల శయనమందిరమున జరుగును .

ఆలయ సమయాలు

ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు

సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు

ఆడియో వినండి :

మమ్మల్ని అనుసరించండి: